యుద్ధానికి మూడ్రోజులు బ్రేక్..దాడులు నిలిపివేసేందుకు రష్యా, ఉక్రెయిన్ అంగీకారం

యుద్ధానికి మూడ్రోజులు బ్రేక్..దాడులు నిలిపివేసేందుకు రష్యా, ఉక్రెయిన్ అంగీకారం

మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా రాయబారులు జరుపుతున్న చర్చల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరస్పర దాడులను తాత్కాలికంగా నిలిపివేయడానికి ఇరు దేశాల నేతలు వ్లాదిమిర్ పుతిన్, వొలొదిమిర్ జెలెన్ స్కీ అంగీకరించారు. అమెరికా రాయబారులు స్టీవ్ విట్‌‌కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కోలో పర్యటిస్తున్న సమయంలో ఈ నిర్ణయం వెలువడింది.

శనివారం అర్ధరాత్రి నుంచి మూడు రోజులు కీవ్‌‌పై వైమానిక దాడులు జరపకూడదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. సోమవారం వరకు మాస్కోపై దాడులను నిలిపివేయడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు.