వెస్ట్ జోన్‌‌ కెప్టెన్‌‌గా రుతురాజ్‌‌

వెస్ట్ జోన్‌‌ కెప్టెన్‌‌గా రుతురాజ్‌‌

ముంబై: దులీప్‌‌ ట్రోఫీ కోసం వెస్ట్‌‌ జోన్‌‌ జట్టును సోమవారం ప్రకటించారు. రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ను కెప్టెన్‌‌గా, షామ్స్‌‌ ములానీని వైస్‌‌ కెప్టెన్‌‌గా నియమించారు.  మొత్తం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. ఆగస్టు 23 నుంచి 26 వరకు జరిగే క్వార్టర్‌‌ఫైనల్‌‌–2లో వెస్ట్‌‌ జోన్‌‌.. నార్త్‌‌ జోన్‌‌తో తలపడుతుంది. ఫైనల్‌‌తో కలిపి మొత్తం ఐదు మ్యాచ్‌‌లు జరుగుతాయి. 

వెస్ట్ జోన్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షామ్స్ ములానీ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, హార్విక్ దేశాయ్, ఉర్విల్ పటేల్, శివాలిక్ శర్మ, ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, జైమీత్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్, తనూష్ కోటియన్, తుషార్ దేశ్‌‌పాండే, శార్దూల్ ఠాకూర్, అతీత్ సేథ్, ముఖేష్ చౌదరి.