
సౌతాఫ్రికా టీ20 మెగా లీగ్ నాలుగో ఎడిషన్ మెగా ఆక్షన్ మొదలైంది. నాలుగో సీజన్ కు ముందు ప్రస్తుతం సౌతాఫ్రికాలో ప్రస్తుతం మెగా ఆక్షన్ జరుగుతోంది. మంగళవారం (సెప్టెంబర్ 9) ప్రారంభమైన వేలంలో స్టార్ క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తోంది. భారత కాలమాన ప్రకారం ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు ఆక్షన్ స్టార్ట్ అయింది. వేలంలోకి వచ్చిన స్టార్ క్రికెటర్లు అంచనాలకు మించి అమ్ముడుపోతున్నారు. సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్, విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ లకు ఫ్రాంచైజీలకు కోట్లు కుమ్మరించారు.
మార్క్రామ్ 14 మిలియన్ రూపాయలకు (రూ. 7 కోట్లు) డర్బన్ సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ గా నిలిపిన మార్క్రామ్, గత సీజన్ లో ఫైనల్ కు చేర్చాడు. రానున్న 2025-2026 సౌతాఫ్రికా టీ20లో ఈ సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ డర్బన్ సూపర్ జెయింట్స్ కు ఆడనున్నాడు. యంగ్ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ 16.50 మిలియన్లుకు (INR 8.30 కోట్లు) ప్రిటోరియా క్యాపిటల్స్ దక్కించుకుంది. ఇటీవలే బ్రెవిస్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ లో అదరగొట్టిన కారణంగా బ్రెవిస్ కు ఇంత భారీ మొత్తం దక్కింది.
►ALSO READ | Asia Cup 2025: ఆసియా కప్‌లో తొలి మ్యాచ్.. హాంగ్‌కాంగ్‌పై ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్
ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ కు భారీ ధర దక్కింది. 2.40 మిలియన్ రూపాయలకు (రూ. 4.50 కోట్లు)ఈ సఫారీ ఆల్ రౌండర్ ను జోబర్గ్ సూపర్ కింగ్స్ దక్కించుకుంది. రైజింగ్ స్టార్ మాథ్యూ బ్రీట్జ్కే ను రూ. 3 కోట్లుకు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ సొంతం చేసుకుంది. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ ను రూ. 2.60 కోట్లకు ఎంఐ కేప్ టౌన్ దక్కించుకుంది. 2025 సీజన్ లో తమ తమ జట్లకు కెప్టెన్లుగా ఉన్న రషీద్ ఖాన్ (MI కేప్ టౌన్), ఫాఫ్ డు ప్లెసిస్ (జోబర్గ్ సూపర్ కింగ్స్), డేవిడ్ మిల్లర్ (పార్ల్ రాయల్స్) మరోసారి ఆయా ఫ్రాంచైజీలు మరోసారి సారధ్య బాధ్యతలు అప్పగించారు. సౌతాఫ్రికా 20 నాలుగో ఎడిషన్ డిసెంబర్ 26, 2025న (బాక్సింగ్ డే) ప్రారంభమై 2026 జనవరి 26 న ముగుస్తుంది.
సౌతాఫ్రికా టీ20 లీగ్ మెగా ఆక్షన్ లో ప్రస్తుతానికి అమ్ముడైన ఆటగాళ్ల జాబితా:
కేశవ్ మహారాజ్ - 85 లక్షలు- ప్రిటోరియా క్యాపిటల్స్
క్వేనా మఫాకా - 1.15 కోట్లు- డర్బన్ సూపర్ జెయింట్స్
క్వింటన్ డి కాక్ -1.20 కోట్లు- సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్
ఐడెన్ మార్క్రామ్- రూ. 7 కోట్లు- డర్బన్ సూపర్ జెయింట్స్
లుంగి న్గిడి- 1.15 కోట్లు- ప్రిటోరియా క్యాపిటల్స్
డెవాల్డ్ బ్రెవిస్- 8.30 కోట్లు- ప్రిటోరియా క్యాపిటల్స్
వియాన్ ముల్డర్ - రూ. 4.50 కోట్లు- జోబర్గ్ సూపర్ కింగ్స్
మాథ్యూ బ్రీట్జ్కే- రూ. 3 కోట్లు- సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్
డెవాన్ కాన్వే- రూ. 16.35 లక్షలు- డర్బన్ సూపర్ జెయింట్స్
రాస్సీ వాన్ డెర్ డస్సెన్- రూ. 2.60 కోట్లు- MI కేప్ టౌన్
Dewald Brevis becomes the most-expensive player in #SA20 history, bought by the Pretoria Capitals! 💰 pic.twitter.com/j01JdIn8pt
— ESPNcricinfo (@ESPNcricinfo) September 9, 2025