రైతుల కోసం  రోడ్లపైనే కొట్లాడుతాం : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

రైతుల కోసం  రోడ్లపైనే కొట్లాడుతాం : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రాపోల్, కాళ్లాపూర్ గ్రామాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా గత 11 రోజులుగా రైతులు చేపట్టిన నిరసన దీక్షకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మద్దతు తెలిపారు. శుక్రవారం ఆమె దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో రైతులు భూములు లాక్కోవద్దన్నారు. అసెంబ్లీలో భూసేకరణ అంశాన్ని లేవనెత్తకుండా ప్రభుత్వం గొంతు నొక్కుతోందని, రైతుల కోసం రోడ్డుపైనే కొట్లాడుతామన్నారు.