Virat Kohli Retirement: 12 ఏళ్ళ క్రితం నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అలానే ఉంది: కోహ్లీ రిటైర్మెంట్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్

Virat Kohli Retirement: 12 ఏళ్ళ క్రితం నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అలానే ఉంది: కోహ్లీ రిటైర్మెంట్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్

విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రపంచ క్రికెట్ లో సంచలనంగా మారింది. వరల్డ్ క్రికెట్ లో టాప్ ఫిట్ నెస్ ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. పరుగులు చేయాలనే తపన ఇంకా ఉన్నప్పటికీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి భారత క్రికెట్ తో పాటు ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. 

36 ఏళ్ళ కోహ్లీకి మరో మూడు నుంచి నాలుగేళ్లు ఈజీగా టెస్ట్ క్రికెట్ ఆడతారని భావించారు. కోహ్లీ మాత్రం అందరికీ ఊహించని షాకిస్తూ త్వరగానే టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పాడు. కోహ్లీ రిటైర్మెంట్ పై తాజాగా టీమిండియా దిగ్గజ క్రికెటర్.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

కోహ్లీ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ 12 ఏళ్ళు వెనక్కి వెళ్లి పోయాడు. కోహ్లీతో తనకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధపై ఎక్స్ లో ఎమోషల్ పోస్ట్ చేశారు. " మీరు టెస్టుల రిటైర్ అయినప్పుడు 12 సంవత్సరాల క్రితం నా చివరి టెస్ట్ సమయంలో మీరు చేసిన ఒక సంజ్ఞ నాకు గుర్తుకు వస్తోంది. మీరు మీ దివంగత తండ్రి ఇచ్చిన ఒక దారాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు. హృదయాన్ని కదిలించే ఆ వస్తువుని  ఇంకా నా దగ్గరే దాచుకున్నాను. వ్యక్తిగతంగా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నన్ను కదిలించింది. ప్రతిఫలంగా నీకు ఏదైనా ఇవ్వడానికి నాకు ఏదీ లేకపోవచ్చు. మీకు నా ప్రగాఢ ప్రశంసలను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను." అని సచిన్ ట్వీట్ చేశారు. 

"విరాట్.. నీ క్రికెట్ జర్నీ చాలామంది యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచింది. ఎంతో మంది క్రికెటర్లను నువ్వు ప్రేరేపించావు. నీది ఎంతో అద్భుతమైన టెస్ట్ కెరీర్. నువ్వు భారత క్రికెట్‌కు చాలా ఎక్కువ ఇచ్చావు. నీ ఆటతో కొత్త తరం అభిమానులను.. ఆటగాళ్లను అందించావు. చాలా ప్రత్యేకమైన నీ టెస్ట్ కెరీర్‌కు అభినందనలు" అని సచిన్ తెలిపారు. సచిన్, కోహ్లీ ఇద్దరూ కలిసి రేండేళ్ల పాటు దేశానికి ఆడారు. కోహ్లీ 2011 లో టెస్ట్ అరంగేట్రం చేయగా.. సచిన్ 2013లో తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు తెలిపాడు. టెస్ట్ క్రికెట్ లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే సచిన్.. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీ నెంబర్ 4 లో బ్యాటింగ్ చేశాడు.