V6 News

క్యారెట్ కబాబ్స్ అదరహో అంటున్న మాస్టర్ బ్లాస్టర్

క్యారెట్ కబాబ్స్ అదరహో అంటున్న మాస్టర్ బ్లాస్టర్

ముంబై: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దొరికిన ఖాళీ టైమ్ లో సెలబ్రిటీలు తమ ఫ్యామిలీస్ తో గడుపుతున్నారు. కొందరు ఇంటి పనుల్లో బిజీగా ఉంటే మరికొందరు వంట పని, తోట పనుల్లో ఇంట్లో వాళ్లకు సాయం చేస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. తాజాగా సచిన్ తన కూతురు సారాతో కలసి తయారు చేసిన బీట్ రూట్ కబాబ్స్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

‘కేవలం 60 సెకన్లలోనే కబాబ్స్ సిద్ధమయ్యాయి. అద్భుతమైన బీట్ రూట్ కబాబ్స్ చేసినందుకు సారాకు థ్యాంక్స్’ అని పోస్ట్ కు సచిన్ క్యాప్షన్ జత చేశాడు. సారా స్వయంగా వండిన తబ్బౌలా అనే మరో వంటకానికి సంబంధించిన ఫొటోను కూడా మాస్టర్ పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలను టెండూల్కర్ పోస్టు చేసిన వెంటనే చాలా మంది ఫ్యాన్స్ హృదయ పూర్వక మెసేజెస్ తో కామెంట్ల వర్షం కురిపించారు.