V6 News

5 వేల మంది ఆకలి తీర్చనున్న సచిన్

5 వేల మంది ఆకలి తీర్చనున్న సచిన్

కరోనా మహమ్మారి నిర్మూల నకు ఇప్పటికే రూ. 50 లక్షలు డొనేట్‌‌‌‌ చేసిన సచిన్‌‌ ‌‌టెండూల్కర్‌‌‌‌.. పేదలను ఆదుకునేందుకు మరో అడుగు ముందుకేశాడు. ‘అప్నాలయా’ ఆర్గనైజేషన్‌‌‌‌ ద్వారా ప్రతి నెల 5 వేల మందికి ఫుడ్‌‌‌‌ పెట్టేం దుకు ముందుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన రేషన్‌‌‌‌ను అందజేయనున్నాడు. ‘లాక్‌‌‌ ‌డౌన్‌‌‌‌లో కష్టాలు ఎదుర్కొంటున్న వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చిన సచిన్‌‌‌‌కు కృతజ్ఞతలు. ఎంతో మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్లకు సాయం అందించాలంటే మా ట్రస్ట్‌‌‌‌ ద్వారా చేయొచ్చు’ అని అప్నాలయా ట్వీట్‌‌‌‌ చేసింది. మరోవైపు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ చెస్‌‌‌‌ ఆడటం ద్వారా ఇండియన్‌‌‌‌ చెస్ ప్లేయర్లు మరో రూ. 2.39 లక్షల ఫండ్‌‌‌ ను రైజ్‌‌‌‌ చేశారు. దీనిని పీఎం కేర్స్ కు అందజేశారు. 17 మంది గ్రాండ్‌‌‌‌ మాస్టర్లు .. 180 మంది ప్లేయర్లు ఆన్‌‌‌‌లై న్‌‌‌‌లో బ్లిట్జ్‌ ఈవెంట్‌‌‌‌ ఆడి ఈ డబ్బును సంపాదించారు.