ఇయ్యాల హైదరాబాద్‌‌కు సడక్ యాత్ర

ఇయ్యాల హైదరాబాద్‌‌కు సడక్ యాత్ర

హైదరాబాద్, వెలుగు: సీపీఎస్‌‌ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ (టీఈఏ), నఫ్రూఫ్ (ఎన్‌‌ఓపీఆర్‌‌‌‌యూఎఫ్) సంయుక్తంగా నిర్వహిస్తున్న సడక్ యాత్ర సోమవారం హైదరాబాద్‌‌కు చేరుకోనుంది. దేశవ్యాప్తంగా ఎంప్లాయీస్, టీచర్లను ఐక్యం చేసేందుకు ఈ నెల 9న కశ్మీర్‌‌‌‌లోని లాల్​చౌక్‌‌లో ఈ యాత్ర ప్రారంభమైందని టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార్ స్వామి తెలిపారు.

జమ్మూ, జలంధర్(పంజాబ్), చండీగఢ్, సహరాన్పూర్ (ఉత్తరప్రదేశ్), డెహ్రాడూన్, హరిద్వార్ (ఉత్తరాఖండ్), ముజఫర్‌‌‌‌నగర్, మీరట్(ఉత్తరప్రదేశ్), ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్ (మధ్యప్రదేశ్), ఝాన్సీ(ఉత్తరప్రదేశ్), భోపాల్, బేతుల్(మధ్యప్రదేశ్), నాగపూర్(మహారాష్ట్ర) మీదుగా సోమవారం హైదరాబాద్‌‌కు చేరుకుంటుందని చెప్పారు. ఉదయం 10 గంటలకు గన్‌‌ పార్క్ అమర వీరుల స్థూపం వద్దకు చేరుకుంటుందని వెల్లడించారు. సీపీఎస్‌‌ను 3 రాష్ట్రాలు రద్దు చేశాయని, కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యోగులకు మేలు జరిగేలా రద్దు చేయాలని కోరారు.