బాగ్లింగంపల్లి చౌరస్తాలో వైభవంగా బతుకమ్మ సంబరాలు

బాగ్లింగంపల్లి చౌరస్తాలో వైభవంగా బతుకమ్మ సంబరాలు

గ్రేటర్ వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. బాగ్ లింగంపల్లి చౌరస్తాలో అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, సినీ నటి జీవిత, ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కె. ఉమ హాజరయ్యారు. అనంతరం మహిళలతో కలిసి తమిళిసై, జీవిత బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం ఆడారు. కార్యక్రమంలో మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ, రాంనగర్ కార్పొరేటర్ రవి చారి, మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎల్​బీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా  నిర్వహించారు.

కూకట్ పల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంట్లో స్థానిక మహిళలతో కలిసి ఆమె బతుకమ్మను పేర్చారు. ఎమ్మెల్సీ కూర్మయ్యగారి నవీన్​రావు పాల్గొన్నారు.

శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో బతుకమ్మ వేడుకలు, ఆటల పోటీలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పతంగి సుష్మరాజ్ గౌడ్, సెక్టార్ ఎస్ఐ సరిత పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ప్రైజ్ లు అందజేశారు. పెద్ద గోల్కొండ గ్రామంలోని కోట మైసమ్మ దేవాలయం సమీపంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. రిటైర్డ్ ఏసీపీ అశోక్ కుమార్, రాచకొండ ఏసీపీ నర్సింహారెడ్డి 
చీఫ్ గెస్టులుగా హాజరై విజేతలకు ప్రైజ్​లు అందజేశారు.   
– వెలుగు, హైదరాబాద్/ముషీరాబాద్/కూకట్ పల్లి/సికింద్రాబాద్/గండిపేట/శంషాబాద్/వికారాబాద్