చిన్నారిపై అత్యాచార నిందితుడ్ని ఉరి తీయాలె

చిన్నారిపై అత్యాచార నిందితుడ్ని ఉరి తీయాలె

హైదరాబాద్: జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడ్ని ఉరి తీయాలని మహాదేవ మఠం పీఠాధిపతి సద్గురు మహాదేవ స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీ మహేశ్ భగవత్‌ను కలసిన మహాదేవ్ స్వామి.. ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. నిందితుడ్ని ఉరి తీయాలని వినతి పత్రంలో కోరారు. ఆ తర్వాత మహాదేవ్ స్వామి మాట్లాడుతూ.. అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడ్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఆ చిన్నారి కుటుంబీకులకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవాలని కోరారు.