
విరూపాక్ష(Virupaksha) హిట్ తరువాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ఇప్పటివరకు తన తరువాతి సినిమాను ప్రకటించలేదు. యాక్సిడెంట్ తరువాత కంబ్యాక్ సినిమాగా వచ్చిన విరూపాక్ష మూవీ సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కార్తీక్ దండు(Karthi varma dandu) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది.
అయితే ఈ సినిమా తరువాత సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమాపై ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మెగా హీరో తన తరువాతి సినిమాను ఫ్లాప్ డైరెక్టర్ తో చేస్తున్నాడట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు సంపత్ నంది(Sampath nandi). ఈ డైరెక్టర్ గత చిత్రం సీటీ మార్(Seetimaarr) బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.
దీంతో కొంత కాలం గ్యాప్ తీసుకున్న సంపత్ నంది.. తాజాగా ఒక కథను సాయి ధరమ్ తేజ్ కు వినిపించాడట. కథలోని పాయింట్ సాయి ధరమ్ కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. సినిమాలో నటించే నటీనటులు, మిగతా టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.