స్వచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో సైఫాబాద్ లోని అంబెడ్కర్ రీసెర్చ్ కాంప్లెక్స్ లో భారత రాజ్యాంగం వర్సెస్ మనుస్మృతి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్, రచయిత జూపాక సుభద్ర, ప్రజాకవి జయరాజ్ హాజరైయ్యారు. సదస్సు పూర్తి అయిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లే అవకాశం ఉందని సైఫాబాద్ పోలీసు అధికారులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మంతం పై నమ్మకం లేని వారి సంఖ్య దేశంలో నాలుగు శాతం పెరిగిందని, అమెరిక వంటి ఆగ్రహ దేశంలో ప్రతి ముగురులో ఒకరు మత విశ్వాసం లేని వారు ఉన్నారని సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్ అన్నారు. మహిళలను కించపరిచేలా మనుస్మృతులో రాసి ఉందని.. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మాత్రం ఆడవాళ్లకు స్వేచ్ఛనిచ్చిరని ఆయన కొనియాడారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ వర్కర్స్ లో ఒకరు కూడా అగ్రహకులానికి చెందిన మహిళలు లేరని, దళిత మహిళలకు ప్రతి చోట అవమానం జరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో జోగిని వ్యవస్థ, బాల్య వివాహాలు ఇంకా ఉన్నాయని ప్రముఖ రచయిత జూపాక సుభద్ర అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ప్రస్తుతం ఎంతో మంది మహిళలు బయటికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. అంబెడ్కర్ రాసిన రాజ్యాంగంలో మహిళలకు, అస్పృశ్యత మంచి మార్గం కనిపించింది, కుల మతాలతో కట్టిన గోడలును కూల్చివేయాలని ప్రజాకవి జయరాజ్ అన్నారు.
