హైదరాబాద్ శివారులో భారీ డ్రగ్ ఫ్యాక్టరీ గుట్టు రట్టయ్యింది. ఆరు నెలల నిఘా, చేజింగ్ అనంతరం ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఆపరేషన్ ద్వారా సంవత్సరాలుగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న డ్రగ్ కింగ్ పిన్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. సోమవారం ( జూన్ 15 ) హైదరాబాద్ శివారులో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ లోని డ్రగ్స్ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు పోలీసులు.
ఈ దాడుల్లో ప్రధాన నిందితులు కీసరి మత్స్యగిరి, నిమ్మల నరేష్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డ్రగ్ ఫ్యాక్టరీ నుంచి రూ.50 లక్షలు విలువైన మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నామని.. మరో రూ.50 లక్షల విలువైన ఫ్యాక్టరీ పరికరాలు, రసాయనాలు సీజ్ చేశామని తెలిపారు పోలీసులు.
నిందితులు రసాయన శాస్త్రవేత్తగా మొదలై ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ సభ్యులుగా ఎదిగారని తెలిపారు పోలీసులు. హత్యలు, దోపిడీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుంచి డ్రగ్స్ తయారీ వైపు మళ్లారని..హైదరాబాద్‌లో తయారైన డ్రగ్స్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.
నిందితులకు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌తో కీలక సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు పోలీసులు. సంతోష్ సింగ్ అలియాస్ రాజు, అలియాస్ రాజేష్, విజయ్, అశ్విని పాఠక్ ముఠాలో కీలక సభ్యులుగా గుర్తించామని తెలిపారు పోలీసులు.
