సైనా నెహ్వాల్ బయోపిక్: శ్రద్ధా కపూర్ ఔట్

సైనా నెహ్వాల్ బయోపిక్: శ్రద్ధా కపూర్ ఔట్

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ లో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ టైటిల్ రోల్ లో నటిస్తోంది. కొంతకాలం ఆమె బ్యాడ్మింటన్లో శిక్షణ కూడా తీసుకున్నారు. సైనా పాత్ర‌లో ఒదిగిపోయిన శ్ర‌ద్ధా లుక్ కూడా విడుద‌ల చేసింది చిత్ర బృందం. అయితే ఈ ప్రాజెక్టు నుంచి శ్రద్ధా కపూర్ తప్పుకున్నారు. ఇంతకాలం ట్రైనింగుతో పాటు యాక్టింగ్ వర్క్ షాప్స్ నిర్వహించిన తర్వాత ఉన్నట్టుండి శ్రద్ధా కపూర్ తప్పుకోవడం ముంబై సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. శ్రద్ధా తప్పుకోవడంతో పరిణీతి చోప్రా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిందట.

షూటింగ్ లేటవుతుండటం, ఇతర సినిమాల డేట్స్ క్లాష్ అవుతుండటంతో శ్రద్ధా కపూర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. వివాదం లేకుండా పరస్పర అంగీకారంతో… ఇటు శ్రద్ధా కపూర్, అటు దర్శక నిర్మాతలు ఈ విషయంలో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివరి వరకు సైనా మూవీ షూటింగ్ పూర్తి చేసి 2020లో విడుదల చేయనున్నట్లు నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు.