ఇండియా డేవిస్ కప్ టీమ్‌లోకి తెలుగు ప్లేయర్ సాకేత్ మైనేని రీ ఎంట్రీ ఇచ్చాడు. గ్రూప్-ఎలో భాగంగా పాకిస్థాన్‌లో పర్యటించనున్న జట్టును ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) సోమవారం ప్రకటించింది. సింగిల్స్, డబుల్స్ ఆడగల మైనేనితో పాటు ఊహించినట్టుగా టాప్ ప్లేయర్లనే జట్టులోకి తీసుకుంది. ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్ సింగిల్స్ విభాగాన్ని నడిపించనుండగా.. రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ డబుల్స్‌లో బరిలోకి దిగనున్నారు. గతేడాది ఇటలీతో జరిగిన డేవిస్ కప్ పోరులో సాకేత్ మైనేని జట్టులో లేడు. ఈ సారి గాయం కారణంగా సుమిత్ నగల్ స్వతహాగా తప్పుకోవడంతో ర్యాంకింగ్స్‌లో అతని తర్వాత మెరుగైన ప్లేస్‌లో ఉన్న మైనేనికి సెలెక్టర్లు చాన్స్ ఇచ్చారు.

