కలిసొచ్చిన పండుగ మూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్లో కార్ల అమ్మకాలు

కలిసొచ్చిన పండుగ మూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్లో కార్ల అమ్మకాలు
  •    హయ్యెస్ట్ మంత్లీ సేల్స్ నమోదు చేసిన మహీంద్రా
  •     పెరిగిన టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కియా, ఎంజీ మోటార్  సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆటో కంపెనీల అమ్మకాలు భారీగా పెరిగాయి. మారుతి సుజుకీ, హ్యుండాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహీంద్రా అండ్ మహీంద్రా  అమ్మకాలు ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 32 శాతం వరకు గ్రోత్ నమోదు చేశాయి.  మారుతి, మహీంద్రా అయితే  రికార్డ్ లెవెల్ అమ్మకాలు జరిపాయి. వివిధ కంపెనీల సేల్స్‌‌‌‌‌‌‌‌  ఇలా ఉన్నాయి..

మారుతి సుజుకీ ..

హయ్యెస్ట్ మంత్లీ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మారుతి సుజుకీ  నమోదు చేసింది. ఈ కంపెనీ కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,67,520 కార్లను అమ్మగా, ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,99,217 వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సేల్ చేసింది. ఇది 19 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమానం. డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,77, 266 బండ్లను మారుతి అమ్మగలిగింది.  ఇది కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మిన 1,47,072 వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  21 శాతం ఎక్కువ. ఆల్టో, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్సో వంటి చిన్న కార్ల అమ్మకాలు మాత్రం పడిపోయాయి. కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 24,936 చిన్న కార్లను మారుతి అమ్మింది. 

కిందటి నెలలో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 14,568 కార్లకు పడిపోయింది. బాలెనో, సెలెరియో, డిజైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇగ్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్విఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేగన్ ఆర్ వంటి కాంపాక్ట్ కార్ల సేల్స్ మాత్రం 73,685 బండ్ల నుంచి 80,662 బండ్లకు పెరిగాయి. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగా,  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌6 వంటి యుటిలిటీ వెహికల్స్ అమ్మకాలు ఏకంగా 91 శాతం పెరిగి 30,971 యూనిట్ల నుంచి 59,147  యూనిట్లకు పెరిగాయి. కిందటి నెలలో 21,951 బండ్లను ఎగుమతి చేశామని మారుతి సుజుకీ ప్రకటించింది. కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్ 20,448 గా రికార్డయ్యింది. 

హ్యుండాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

హ్యుండాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా  ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 68,728 కార్లను అమ్మగలిగింది. ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మారుతి తర్వాత ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ కంపెనీ నిలిచింది. కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మిన  58,006 కార్లతో పోలిస్తే కిందటి నెలలో 18 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరియన్ కంపెనీ సాధించింది. హ్యుండాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 55,128 బండ్లు అమ్మగా, కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేల్ చేసిన 48,001 వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. ఎగుమతులు 36 శాతం పెరిగి 13,6 00 యూనిట్లకు చేరుకున్నాయి. 

‘హ్యుండాయ్ అన్ని మోడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నాం. ఈ నిర్ణయానికి కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. అంతేకాకుండా సప్లయ్ సమస్యలు తొలగిపోయాయి. కస్టమర్లకు కార్లను వీలున్నంత వేగంగా డెలివరీ చేస్తున్నాం’ అని హ్యుండాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. 

టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

టాటా మోటార్స్ మొత్తం సేల్స్ (ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ + కమర్షియల్ )  కిందటి నెలలో 82,954 వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాయి. కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మిన 78,335 బండ్లతో పోలిస్తే ఇది 6 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమానం. లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 80,825 బండ్లను కంపెనీ సేల్ చేసింది. ప్యాసింజర్  కార్ల అమ్మకాలు కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 45,217 యూనిట్లుగా నమోదవ్వగా, ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 48,337 యూనిట్లకు పెరిగింది. ఇందులో ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ కూడా కలిసి ఉన్నాయి.  టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందటి నెలలో 5,465 ఎలక్ట్రిక్ కార్లను అమ్మింది. కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4,277 యూనిట్లుగా ఉంది. కంపెనీ  కమర్షియల్ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 34,317 వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెరిగాయి.    

మహీంద్రా..

మహీంద్రా అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహీంద్రా కిందటి నెలలో రికార్డ్ లెవెల్లో అమ్మకాలు జరిపింది.  కిందటేడాది  అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 61,114 వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమ్మిన ఈ కంపెనీ ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 89,679  వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సేల్ చేయగలిగింది. ఇది 32 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమానం. అంతేకాకుండా మహీంద్రాకు ఇదే అత్యధిక మంత్లీ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. ఇందులో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీలు, కమర్షియల్ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండూ కలిసి ఉన్నాయి. యుటిలిటీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మకాలు 36 శాతం పెరిగి 32,226 యూనిట్ల నుంచి 43,708 యూనిట్లకు పెరిగాయి. 

మహీంద్రా ఎగుమతులు మాత్రం 2,755 యూనిట్ల నుంచి 1,854 యూనిట్లకు పడిపోయాయి.  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీ, కమర్షియల్ వెహికల్  రెండు సెగ్మెంట్లలోనూ ఎప్పుడూ లేనంతగా రికార్డ్ లెవెల్ అమ్మకాలు  జరిపామని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. ఈ కంపెనీ కిందటి నెలలో 25,715 కమర్షియల్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమ్మింది. కంపెనీ ట్రాక్టర్ల అమ్మకాలు కూడా  50,460 బండ్ల నుంచి 51,994 బండ్లకు పెరిగాయి.

మిగిలిన కంపెనీల సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇలా..

1. ఎంజీ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందటి నెలలో 5,108 కార్లను అమ్మింది. ఇందులో 25 శాతం వాటా ఎలక్ట్రిక్ కార్లదే ఉందని కంపెనీ పేర్కొంది. 
2. కియా ఇండియా సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 4 శాతం పెరిగి కిందటి నెలలో 24,351 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో సెల్టోస్ అమ్మకాలు 12,362 యూనిట్లుగా ఉన్నాయి.
3. బజాజ్ ఆటో సేల్స్  కిందటి నెలలో ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 19 శాతం పెరిగి  4,71,188 వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాయి.  ఇదే కంపెనీకి అత్యధిక మంత్లీ సేల్స్.
4. సుజుకీ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందటి నెలలో 1,00,507 బండ్లను అమ్మింది.