వాషింగ్టన్: ఇజ్రాయెల్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇరాన్‌తో శాంతి చర్చలు కీలక దశకు చేరుకున్న వేళ లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడి చాలా అనవసరమైన చర్య అన్నారు. అయితే, శత్రువుల దాడి నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని.. కానీ చిన్న చిన్న సంఘటనలకు కూడా ఆ దేశం అతిగా స్పందించడం కరెక్ట్ కాదని చురకలంటించారు.
ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలు పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాన్ని సాధించే లక్ష్యంతో కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని సూచించారు. లెబనాన్‌లో మరిన్ని దాడులు చేయకుండా ఉండాలని ఇజ్రాయెల్‌ను కోరారు. అలాగే, హిజ్బుల్లా, ఇతర గ్రూపులు ఇజ్రాయెల్‌పై దాడులను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. కీలక దశలో ఉన్న శాంతి ఒప్పందాన్ని ప్రమాదంలో పడేయొద్దని ఇరుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు.
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందంపై చర్చలకు కీలక దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో లెబనాన్, ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేసుకోవడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఆదివారం (జూన్ 14) హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై మూడు క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ దాడులకు ప్రతిస్పందనగా లెబనాన్ రాజధాని బీరూట్ నగరంపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది.
►ALSO READ | ప్రియురాలికోసం..అమెరికా ఫుట్ బాల్ మ్యాచ్ చూసిన కెనడా మాజీ ప్రధాని ..సోషల్ మీడియాలో బిగ్ డిబేట్!
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు చివరి దశకు చేరుకున్న వేళ లెబనాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ టెన్షన్స్ మొదలయ్యాయి. ఈ దాడులతో శాంతి ఒప్పందంపై చర్చలకు ఆటంకం కలిగించే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఇజ్రాయెల్ తీరుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని హెచ్చరించారు. శాంతి ఒప్పందాన్ని సాధించేందుకు ఫైనల్ స్టేజ్‌కు వచ్చిన ప్రయత్నాలు దెబ్బతీయొద్దని వార్నింగ్ ఇచ్చారు.
