టెలిగ్రామ్ సీఈవోపై రష్యా మోస్ట్ వాంటెడ్ నోటీస్ : ఫ్రాన్స్ అప్పగిస్తుందా లేదా..?

టెలిగ్రామ్ సీఈవోపై రష్యా మోస్ట్ వాంటెడ్ నోటీస్ : ఫ్రాన్స్ అప్పగిస్తుందా లేదా..?

టెలిగ్రామ్ యాప్ తెలుసుకదా.. నీట్ పేపర్ లీక్ విచారణలో భాగంగా.. రీ ఎగ్జామ్ నిర్వహించే సమయంలో వారం రోజులు ఇండియాలో బంద్ చేశారు.. ఇండియా ఈ విధంగా ఉంటే.. ఇప్పుడు రష్యా రంగంలోకి దిగింది. టెలిగ్రామ్ యాప్ సృష్టికర్త, సీఈవో దురోవ్ పై ఉగ్రవాదం కేసు కింద మోస్ట్ వాంటెడ్ నోటీస్ జారీ చేసింది రష్యా ప్రభుత్వం.

టెలిగ్రామ్ సీఈవో దురోవ్.. తన యాప్ ద్వారా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని.. రష్యాకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఉక్రెయిన్ తో పంచుకుంటున్నారని.. సమాచారాన్ని తొలగించాలని కోరినా పట్టించుకోవటం లేదంటూ తీవ్ర నేరారోపణలు చేస్తూ.. తన అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ నోటీస్ జారీ చేసింది రష్యా.

టెలిగ్రామ్ అధినేత పావెల్ డురోవ్‌పై రష్యా భద్రతా సంస్థ ఎఫ్‌ఎస్‌బీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. టెలిగ్రామ్‌లోని పలు ఛానెల్స్ , బాట్స్‌ను ఇప్పటికీ తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థలు విధ్వంసక చర్యలు, ఉగ్రదాడులు, సామూహిక హత్యలు,సైబర్ మోసాలకు ప్రణాళికలు రచిస్తూ... ఈ ప్లాట్‌ఫారమ్‌ను సమన్వయం కోసం వాడుకుంటున్నాయని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలో డురోవ్‌పై ఏకంగా ఉగ్రవాదానికి సహకరించారనే తీవ్ర అభియోగాలు మోపడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.

 అయితే, రష్యా తన రాజకీయ వ్యతిరేకులను అణచివేయడానికి ఉగ్రవాదం  అనే పదాన్ని ఆయుధంగా వాడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ పరిణామం ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

►ALSO READ | చైనా రోబోలపై అమెరికాలో బ్యాన్..జాతీయ భద్రతకు ప్రమాదమంటున్న యూఎస్

 దురోవ్ గతంలో రష్యా ఫేస్‌బుక్‌గా పేరుగాంచిన వీకేకాంటాక్టే (VKontakte) సంస్థను స్థాపించారు. అధికారుల ఒత్తిడితో ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చిన ఆయన, ఆ తర్వాతే టెలిగ్రామ్‌ను సృష్టించారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లోనూ చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న దురోవ్ వ్యవహారం అంతర్జాతీయ టెక్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.