‘‘ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు’’.. ఇది పాత సినిమాలో ఓ ఫేమస్ సాంగ్.. ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ఫుట్ మ్యాచ్ చూసిన కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యవహారం చూస్తుంటే ఈ పాట గుర్తుకు రాకమానదు. అమెరికాకు చెందిన పాప్ సింగర్ తో గాఢ ప్రేమలో ఉన్న ట్రూడో.. ఏకంగా ప్రియురాలికోసం చేసిన సాహసం, ఓ మాజీ ప్రధానిగా చేయకూడని పని చేసి ఇరకాటంలో పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ గా మారింది.
ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఫీఫా ప్రపంచ కప్ ..ఫుట్‌బాల్ అభిమానులనేకాదు ప్రముఖ సెలబ్రిటీలు ,ప్రజా ప్రముఖులను ఇట్టే కట్టిపడేస్తోంది. అందులో కెనడా మాజీ ప్రధాని కూడా ఉన్నారు. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, సింగర్ కేటీ పెర్రి జంట.. కాలిఫోర్నియాలో జరిగిన అమెరికా, పరాగ్వే మ్యాచ్ తిలకిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఓ స్పెషల్ బాక్సులో కూర్చొని మ్యాచ్ చూస్తూ హల్ చల్ చేశారు. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రియురాలు కేటీ పెర్రీ కోసం ఈ మా జీ ప్రధాని ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు స్పెషల్ గా అమెరికాకు వచ్చాడు. ఇది ఒకరకంగా సాహసమని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ దేశ మాజీ ప్రధాని ఇంకో దేశంలో .. అందునా సొంత దేశం ఆడుతున్న మ్యాచ్ ను చూడకుండా ప్రియురాలికోసం పక్క దేశం మ్యాచ్ చూడటం మాటలు కాదు కదా. అందుకే జస్టిన్ ట్రూడో వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కాలిఫోర్నియాలోని ఇంగిల్‌వుడ్‌లో పరాగ్వేతో జరిగిన యునైటెడ్ స్టేట్స్ ప్రారంభ ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆయన కనిపించారు. అదే రోజు కెనడాలో బోస్నియా ,హెర్జెగోవినాతో జరిగిన ప్రారంభ మ్యాచ్ ను వదిలిపెట్టి ప్రియురాలి కోసం అమెరికా మ్యాచ్ చూడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
►ALSO READ | భారతదేశ సంస్కరణల ఎక్స్‌ప్రెస్ ఆగదు.. మాతో కలిసి పని చేసేందుకు రండి: ప్రధాని మోడీ
ట్రూడో నిర్ణయం ఆన్ లైన్ లో అనేక ఊహాగానాలకు దారి తీసింది. పెర్రీతో ప్రేమాయణంపై రకరకాలుగా మాట్లాడుకున్నారు. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో 2026 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ రోజున దేశం కంటే ప్రేమకే ప్రాధాన్యతనిచ్చారు. ప్రేమకోసం ట్రూడో సాహసం చేశారని కొందరంటుండగా.. కెనడా ఆరంభ మ్యాచ్ కంటే టీమ్ యూఎస్ఏ మ్యాచ్‌నే ఎంచుకున్నట్లు కనిపించడంతో విమర్శలు కూడా వచ్చాయి.
ఇక వ్యవహారంపై స్పందించిన ట్రూడో.. తానను తాను సపోర్టివ్ బాయ్ ఫ్రెండ్ గా చెప్పుకున్నారు. కొన్ని కొన్ని సార్టు ప్రియుడిగా బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో మేసేజ్ షేర్ చేశారు. తన విధేయత ఎవరి పట్ల ఉండో స్పష్టం చేస్తూ కెనడియన్ జెండా ఎమోజీని కూడా జతచేశారు.
54 ఏళ్ల ట్రూడో, 41 ఏళ్ల పెర్రీ గత జూలైలో తమ మొదటి డేట్‌కు వెళ్లారు. డిసెంబర్ నాటికి జంటగా మారారు. ఈ యేడాది ప్రారంభంలో పెర్రీ సోషల్ మీడియాలో ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించారు. గత వారం, ట్రూడో ,పెర్రీ, ట్రిబెకా ఫెస్టివల్‌లో ఆమె చిత్రం "కేటీ పెర్రీ: ది లైఫ్‌టైమ్స్ టూర్ - లైవ్ ఫ్రమ్ పారిస్" ఆవిష్కరణ సందర్భంగా మొదటిసారి కలిసి రెడ్ కార్పెట్‌పై నడిచారు.నేను ట్రూడోతో గాఢంగా ప్రేమలో ఉన్నాను అని ప్రకటించింది.
