
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) బి–డివిజన్ 2డే లీగ్‌లో సలీంనగర్ టీమ్ బౌలర్ తాతవర్తి కమల్ స్వరూప్ సత్తాచాటుతున్నాడు. చార్మినార్ జట్టుతో శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో కమల్ స్వరూప్ (5/51) ఐదు వికెట్లు పడగొట్టాడు.
దాంతో చార్మినార్53.4 ఓవర్లలో 184 రన్స్‌కే ఆలౌటైంది. అనంతరం సలీంనగర్ టీమ్ తొలి రోజు 28.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ప్రణీత్ కుమార్ (60) రాణించాడు. వర్షం కారణంగా రెండో రోజు ఆట రద్దవడంతో ఇరు జట్లకూ చెరో రెండు పాయింట్లు కేటాయించారు. కాగా, రెండు మ్యాచ్‌ల్లో 8 వికెట్ల పడగొట్టిన కమల్ స్వరూప్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు.