పిల్లోడితో  కలిసి దొంగతనాలు.. మైనర్తో పాటు  ప్రధాన నిందితుడు అరెస్ట్

పిల్లోడితో  కలిసి దొంగతనాలు.. మైనర్తో పాటు  ప్రధాన నిందితుడు అరెస్ట్

ఓల్డ్​సిటీ వెలుగు : చెడు అలవాట్లకు బానిసై బాలుడి వెంట ఉండి దొంగతనాలు చేయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మైలార్ దేవ్ పల్లి లక్ష్మీగూడకు చెందిన సల్లంగుల శ్రీకాంత్ (23) అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడితో దొంగతనాలు చేయిస్తున్నాడు. అతడిని వెంటేసుకుని పార్క్ చేసి ఉన్న టూ వీలర్లు, ఆటోలను దొంగిలించేవాడు. గతేడాది డిసెంబర్ లో శ్రీరాం కాలనీ హనుమాన్ టెంపుల్​హుండీలో ఉన్న రూ.70వేల నగదు కూడా కాజేశారు.

అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు.  గతంలో శ్రీకాంత్ పహాడిషరీఫ్, కర్నూల్ టూ టౌన్ , మహబూబ్​ నగర్ లలో పలు దొంగతనాలు చేశాడు. శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా, బాలుడిని జువైనల్ హెూంకు పంపించారు. 3 ఆటోలు, 4 టూ వీలర్​ లు స్వాధీనం చేసుకున్నారు.