బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార జంటగా తెలుగు దర్శకుడు వంశీపైడిపల్లి డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శనివారం ముంబైలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. మొదటి షెడ్యూల్‌ను మొదలుపెట్టినట్టు తెలియజేశారు. నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ కోసం ముంబైలో స్పెషల్ సెట్స్ వేశారు.
ఇందులో హై-ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌తోపాటు, కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సల్మాన్‌తోపాటు నయనతార కూడా సెట్‌లోకి అడుగుపెట్టారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడగా, షూటింగ్ ప్రారంభంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది.
త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను వెల్లడించనున్నారు. స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో కూడిన హై ఎనర్జీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్‌కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

