నెలాఖరులో నవ్వుల సరిగమలు

నెలాఖరులో నవ్వుల సరిగమలు

శ్రీవిష్ణు హీరోగా ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుకి జంటగా రెబా మోనికా జాన్ నటిస్తోంది.

ఇప్పటికే టీజర్‌‌‌‌‌‌‌‌, ఫస్ట్ సాంగ్‌‌‌‌తో ఇంప్రెస్‌‌‌‌ చేసిన మేకర్స్, సోమవారం రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ రాశారు. నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.