10 మిలియన్ల ఫాలోవర్స్..10 ఎన్జీవోలకు విరాళం

10 మిలియన్ల ఫాలోవర్స్..10 ఎన్జీవోలకు విరాళం

సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత మరో ఫీట్ సాధించింది. ఇన్ స్టాగ్రమ్ లో 10 మిలియన్ ఫాలోవర్స్  ను సంపాదించిన జాబితాలో చేరింది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత 10 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో  ఆక్టివ్ గా ఉండే సమంత అపుడపుడు తన భర్త నాగచైతన్య ఫోటోలను షేర్ చేస్తుంది.

10 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకోవడంపై సమంత కూడా ఆనందం వ్యక్తం చేసింది.  తాను ఇన్ స్టాగ్రమ్ లో 10 మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్నందుకు గాను 10 స్వచ్ఛంద సంస్థలకు తన వంతు ఆర్థిక సాయం చేస్తానని చెప్పింది.  తాను నటించిన ఓ బేబి సినిమాలో ఆనందంతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది సమంత.