సమంత వేసుకున్న చెప్పుల ధర రూ.8 వేలు..

సమంత వేసుకున్న చెప్పుల ధర రూ.8 వేలు..

సెలబ్రిటీలు.. రాజకీయ నాయకులు, వీఐపీలు ధరించే దుస్తులు.. వాడే వస్తువులు.. వాటి ధరలు ఇలా ప్రతి వార్త ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఓ సినీ సెలబ్రెటీ వేసుకున్న చెప్పుల ధరపై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.  

ఇంతకు ఎవరా సెలబ్రెటీ అనుకుంటున్నారు.. ఆవిడేనండీ.. టాలీవుడ్ బ్యూటీ సమంత.  విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి' సినిమాకు సంబంధించి రెండో పాట 'ఆరాధ్య'లో ఓ సన్నివేశంలో సమంత 'అప్రాజితా తూర్ ఖైత్ హీల్స్'తో కనిపిస్తుంది. ఇవి మూవీ  ఫ్రేమ్ కి మరింత అందాన్ని జోడించాయంటే అతిశయోక్తి కాదు.

అయితే ఆ చెప్పుల ధరే ఇప్పుడు వైరల్ గా మారింది. వాటి ధర ఎంతనుకుంటున్నారు.. అక్షరాలా రూ.7 వేల 399.. నిజమేనండీ వాటి గురించి సర్చ్ చేస్తే అదే విషయం తెలుస్తోంది. సంప్రదాయబద్ధంగా ఉన్న ఈ చెప్పులు సమంత అందాన్ని రెట్టింపు చేశాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  కానీ వాటి ధర విని షాక్ అవుతున్నారు.  శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఖుషి మూవీని 2023 ఎండింగ్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

సినిమా మొదటి సాంగ్ 'నా రోజా నువ్వే' ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండో పాట కూడా పాజిటివ్ టాక్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.