సంబరాల ఏటిగట్టు  ముంబై  షెడ్యూల్ కంప్లీట్

సంబరాల ఏటిగట్టు  ముంబై  షెడ్యూల్ కంప్లీట్

సాయి దుర్గా తేజ్ హీరోగా రోహిత్  కేపీ దర్శకత్వంలో  ప్రైమ్ షో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నిరంజన్ రెడ్డి,  చైతన్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’.  తాజాగా ముంబై షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు తెలియజేశారు మేకర్స్. ఈ షెడ్యూల్‌‌‌‌లో   ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొనడం చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అన్నారు. అయితే ఆ నటుడు ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. ఈ  చిత్రంలో సాయి  తేజ్ తన కెరీర్‌‌‌‌లోనే అత్యంత సవాలుతో కూడిన పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు. 

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌‌‌‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు.   ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌‌‌‌గా నటిస్తుండగా,  జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్,  అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.   బి అజనీష్ లోక్‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.  ‘హనుమాన్’ లాంటి భారీ విజయం తర్వాత ప్రైమ్ షో ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే మరిన్ని అప్‌‌‌‌డేట్స్ అందిస్తామని మేకర్స్ చెప్పారు.