యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయ్యిందని.. కాలర్ పట్టి లాక్కెళ్తారా.. సమోసా వ్యాపారి దౌర్జన్యం వైరల్

యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయ్యిందని.. కాలర్ పట్టి లాక్కెళ్తారా.. సమోసా వ్యాపారి దౌర్జన్యం వైరల్

యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయ్యిందని ఓ సమూసా వ్యాపారి చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ కస్టమర్ ను కాలర్ పట్టుకుని లాక్కెల్లడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జబల్పూర్ రైల్వే స్టేషన్ లో అక్టోబర్ 17న జరిగిన ఈ ఇన్సిడెంట్ చర్చకు దారితీసింది. చివరికి పోలీసులు దర్యాప్తు చేసే వరకు వెళ్లింది.

బాధిత ప్యాసెంజర్ చెప్పిన వివరాల ప్రకారం.. జబల్పూర్ స్టేషన్లో  రైలు ఆగడంతో ఏదైనా కొందామని దిగిన ప్యాసెంజర్.. రెండు సమూసాలు కావాలని అడిగాడు. వ్యాపారి రెండు సమూసాలు ఇచ్చాడు. ఫోన్ పే ద్వారా చెల్లించేందుకు ప్రయత్నించగా అది పనిచేయలేదు. 

అటు రైలు మూవ్ అవ్వడంతో.. రైలు వెళ్లిపోతుంది.. ఫోన్ పే పనిచేయడం లేదు.. సమూసాలు వద్దులే అని ఇవ్వబోయాడు ఆ ప్యాసెంజర్. దీంతో రిటర్న్ తీసుకునేది ఉండదు. డబ్బులు ఇచ్చినాకే ఇక్కడి నుంచి కదలాలని వాదన షురూ చేశాడు. 

ట్రైన్ వెళ్లిపోతుందని.. సమూసాలు తీసుకోవాలని ప్యాసెంజర్ కోరగా.. అదంతా కుదరదు.. డబ్బులిచ్చి ఇక్కడి నుంచి కదులు. లేదంటే చేతికున్న రిస్ట్ వాచ్ ఇచ్చి వెళ్లు అని దౌర్జన్యానికి దిగాడు. ప్యాసెంజర్ ను వెళ్లనివ్వకుండా కాలర్ పట్టుకుని లాగడంతో అక్కడ పెద్ద సీన్ క్రియేట్ అయ్యింది. 

వ్యాపారి కాలర్ వదలక పోవడంతో.. అక్కడ రైలు వెళ్లిపోతుందని వాచ్ ఇచ్చి వెళ్లిపోయాడు ప్యాసెంజర్. కేవలం రెండు సమూసాలకు ఇంతలా  భయపెట్టి..  అవమానించాలా.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ మాఫియా ఎలా తయారైందో చూడండని షేర్ చేస్తున్నారు. 

ఈ వీడియో క్లిప్ ను ఎక్స్ (ట్వి్ట్టర్) లో పోస్ట్ చేశారు సాటి ప్రయాణికులు. రెండు సమూసాల కోసం ప్రయాణికుడి కాలర్ పట్టుకుని పరువు తీస్తారా అంటూ కామెంట్స్ చేస్తుండటంతో వైరల్ గా మారింది. జబల్పూర్ డివిజన్ రైల్వే మేనేజర్ (DRM)ఈ ఘటనపై స్పందించారు. సమూసా వ్యాపారిని గుర్తించినట్లు చెప్పారు.  అతనిపై రైల్వే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.