హనీమూన్ ఫోటో షేర్ చేసిన షోయబ్ మాలిక్ కొత్త భార్య

హనీమూన్ ఫోటో షేర్ చేసిన షోయబ్ మాలిక్ కొత్త భార్య

పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ సనా జావేద్‌తో మూడో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ మాజీ ఆటగాడిపై విమర్శలు ఎక్కువయ్యాయి. సానియా మీర్జాకు విడాకులిచ్చి మూడో పెళ్లి చేసుకోవడంతో ఈ మాజీ పాక్ క్రికెటర్ పై తీవ్ర స్థాయిలో నెటిజన్స్ మండిపడ్డారు. ఇక ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌ చేస్తూ షోయబ్ ను నెటిజన్స్ ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. దీనికి తోడు ఓ పాక్ మీడియా కథనం మాలిక్ కు పలువురు మోడళ్లు, సెలెబ్రిటీలతో సంబంధాలు కొనసాగిస్తుండగానే సనాతో అతనికి పరిచయం ఏర్పడినట్లు చెప్పుకొచ్చారు.

తాజాగా హానీ మూన్ ఫోటోతో మరోసారి వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. గురువారం (ఫిబ్రవరి 8) మాలిక్ భార్య సనా జావేద్ తన ఇన్‌స్టాగ్రామ్ లో హనీమూన్‌ చిత్రాన్ని పోస్ట్ చేసింది. రూఫ్‌టాప్ పూల్‌సైడ్‌లో పసుపు, తెలుపు కలర్ చారలతో రెండు జతల పాదాలతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ చిత్రాన్ని చూసిన నెటిజన్స్ ఈ జంటను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. చూసిన కొంతమంది నెటిజన్స్ ఆమెను హౌస్ బ్రేకర్ అంటూ మండిపడుతున్నారు. 

మాలిక్ పై ప్రస్తుతం సొంత దేశం పాకిస్థాన్ లో సైతం విమర్శల వర్షం కురుస్తుంది. మరోవైపు సానియాకు పాకిస్థాన్ లో మద్దతు లభిస్తుంది. ఇదిలా ఉండగా.. తనపై వస్తున్న ట్రోల్స్, విమర్శలపై మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక ఆన్ లైన్ పోడ్ కాస్ట్ లో మాలిక్ తనపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాడు. మీ మనసు ఏది చెబితే మీరు అదే చేయాలని నేను భావిస్తున్నాను. బయట ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించకూడదు. ప్రజలు ఏమనుకుంటారో అర్థం చేసుకోవడానికి మీకు 10 లేదా 20 సంవత్సరాలు పట్టవచ్చు. అని కొన్ని రోజుల క్రితం మాలిక్ అన్నాడు.

ALSO READ :- నా భార్య చాలా మంచిది.. ఆమె ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమిది: రవీంద్ర జడేజా

మొదట అయేషా సిద్దిఖీని రహస్యంగా వివాహమాడిన షోయబ్.. 2010లో ఆమెకు విడాకులిచ్చిన వెంటనే సానియా మీర్జాను పెళ్లాడాడు. వీరిది ప్రేమ వివాహం. ఈ జంటకు ఇజాన్ మీర్జా అనే ఒక కుమారుడు ఉన్నాడు. వారం రోజుల క్రితం ఆమెకు గుడ్ బై చెప్పి.. పాకిస్తానీ నటి సనా జావేద్ ను మనువాడాడు.