హైదరాబాద్: సనత్ నగర్ టిమ్స్‌ను 2026, మే నెలలో ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బ్లాక్ ఏ, బ్లాక్ బీలో పనులన్నీ పూర్తయ్యాయని.. జస్ట్ ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయన్నారు. మంగళవారం (మే 12) ఆయన సనత్ నగర్ టిమ్స్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. ఇది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా ప్రజలకు సేవ చేయబోతోందని చెప్పారు.
ఏ, బీ, సీ మొత్తం మూడు బ్లాక్‌లలో వెయ్యి పడకలతో ఆసుపత్రి నిర్మాణం జరిగిందని.. ఇందులో ఎమర్జెన్సీ 350 పడకలు, జనరల్ బెడ్స్ 500, పెయిడ్ బెడ్స్ 100, ఇంటర్నేషనల్ పేషెంట్స్ కోసం మరో 100 కేటాయించామని తెలిపారు. సనత్ నగర్ టిమ్స్ తెలంగాణ మొత్తానికి కార్డియో సైన్స్‌కి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా రూపుదిద్దామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్‌కి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా కూడా సనత్ నగర్ టిమ్స్ ఉండబోతోందని వెల్లడించారు.
భవిష్యత్తులో ఇక్కడ రీసెర్చ్ సెంటర్‌ను కూడా ఎస్టాబ్లిష్ చేయాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి మీటింగులు, కాన్ఫరెన్సులు నిర్వహించేలా ఎస్టాబ్లిష్ చేయబోతున్నామని తెలిపారు.
స్కిల్ ల్యాబ్, రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మిగిలిన టిమ్స్ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
