సందీప్ కిషన్ హీరోగా రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రాన్ని ప్రకటిస్తూ, ‘పవర్ పేట’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు.
రక్తంతో తడిసిన చెస్ బోర్డ్ మధ్య గులాబి పువ్వుతో డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది. ప్రేమ, గౌరవం, రాజకీయాల నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా ఇదని అర్థమవుతోంది. వాస్తవికతకు దగ్గరగా ఉండనున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి మధీ సినిమాటోగ్రాఫర్. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

