- సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య
ఝరాసంగం,వెలుగు: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్)లో మౌలిక వసతుల కల్పన పనులను స్పీడప్ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల పరిధిలోని రుక్మాపూర్, ఎల్గోయి శివారులో పర్యటించి మౌలిక వసతుల పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎస్ఆర్ఆర్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇప్పటికే సేకరించిన భూములలో రైతులు పంటలు వేసుకుని ఉంటే వారిని గుర్తించి నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి మాచునూర్ గ్రామ శివారులో నిర్మిస్తున్న ప్రభుత్వ వేర్హౌజ్పనులను పరిశీలించారు.

