సంజయ్‌‌‌‌ నోట.. సంఘ్‌‌‌‌ పాట..సింగర్‌‌‌‌గా మారిన  కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌

సంజయ్‌‌‌‌ నోట.. సంఘ్‌‌‌‌ పాట..సింగర్‌‌‌‌గా మారిన  కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌

కరీంనగర్, వెలుగు : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ సింగర్‌‌‌‌గా మారారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌‌‌‌ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపించి వందేళ్లయిన సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటను ఆయన ఆలపించారు.

ఆర్ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ సిద్దాంతాలను  ప్రజల్లోకి తీసుకెళ్లాలన్ లక్ష్యంతోనే గీతాలపన చేశారు. సంజయ్‌‌‌‌ పాడిన పాటకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్ గా మారింది. బండి సంజయ్‌‌‌‌ పాడిన పాటను శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం యూట్యూబ్‌‌‌‌లో రిలీజ్‌‌‌‌ చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.