టాప్ సీడ్ను ఓడించి క్వార్టర్ ఫైనల్కు సానియా జోడీ

టాప్ సీడ్ను ఓడించి క్వార్టర్ ఫైనల్కు సానియా జోడీ

టొరంటో: ఇండియా టెన్నిస్‌‌‌‌ స్టార్‌‌ సానియా మీర్జా కెనడియన్‌‌ ఓపెన్‌‌ టోర్నమెంట్‌‌లో సంచలనం సృష్టించింది. అమెరికా ప్లేయర్‌‌ మాడిసన్ కీస్‌‌తో తొలిసారి జోడీకట్టిన సానియా విమెన్స్‌‌ డబుల్స్‌‌లో టాప్‌‌ సీడ్స్‌‌ను ఓడించి క్వార్టర్‌‌ఫైనల్‌‌ చేరుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌‌లో సానియా–కీస్‌‌ జంట  3–6, 6–4, 10–8తో టాప్‌‌ సీడ్‌‌ వెరోనియా కుదెమెతోవా(రష్యా) –ఎలైస్‌‌ మెర్టెన్స్‌‌ (బెల్జియం) ద్వయంపై ఉత్కంఠ విజయం సాధించింది.