
టెన్నీస్ స్టార్ సానియా మీర్జా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన సానియా గత కొన్ని రోజులుగా టెన్నీస్ కు దూరంగా ఉంది. మళ్లీ టెన్నీస్ కోర్టులో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది సానియా. ఇందు కోసం బరువు తగ్గించుకునేందుకు రోజూ జిమ్ లో తెగ కష్టపడుతోంది. బాడీ ఫిట్ నెస్ కోసం జిమ్ లో ఎక్ససైజ్ చేస్తున్న వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది సానియా.తాను టెన్నీస్ ఆడేందుకు ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేసింది.