డూప్లికేట్ ​ఫింగర్​ ప్రింట్స్​తో.. శానిటేషన్ కార్మికుల పైసలు స్వాహా

డూప్లికేట్ ​ఫింగర్​ ప్రింట్స్​తో.. శానిటేషన్ కార్మికుల పైసలు స్వాహా

మెహిదీపట్నం, వెలుగు: డ్యూటీకి రాని బల్దియా శానిటేషన్ కార్మికుల డూప్లికేట్ ఫింగర్​ప్రింట్స్​తో అటెండెన్స్ వేసి​పైసలు కొట్టేస్తున్న ఎస్ఎఫ్ఏ(శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్)ను కుల్సుంపురా పోలీసులు అరెస్ట్ చేశారు.​ ఎస్సై మక్సూద్ తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ సంజయ్​నగర్​కు చెందిన ఉల్క నందకర్ సత్యనారాయణ(48) గోషామహల్ సర్కిల్–14లోని ఆగాపురాలో ఎస్ఎఫ్ఏగా పనిచేస్తున్నాడు.

శానిటేషన్​ వర్కర్ల ఫింగర్ ప్రింట్లను సేకరించి, సింథటిక్​ ఫింగర్ ప్రింట్లను తయారు చేశాడు. విధులకు రాని వర్కర్లను గుర్తించి వారి అటెండెన్స్​ను సింథటిక్ ఫింగర్​ప్రింట్స్ సాయంతో వేసేవాడు. ఇలా రోజు 5 నుంచి 8  మంది వర్కర్లకు అటెండెన్స్​ను వేసి వారికి డైలీ వచ్చే రూ.200ను కాజేస్తున్నాడు. సమాచారం అందుకున్న కుల్సుంపురా పోలీసులు సత్యనారాయణను గురువారం అరెస్ట్ చేశారు. 5 డూప్లికేట్​​ ఫింగర్ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు.