సోనా కామ్స్టర్ అధినేత సంజయ కపూర్ మృతితో ఏర్పడిన వివాదం ఇంకా చల్లారలేదు. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. 30 వేల కోట్ల రూపాయల పంపకాలకు సంబంధించి ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వాన్ని ప్రతిపాదించింది. 2026 మే 7న సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ను మధ్యవర్తిగా నియమించింది.
జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ లతో కూడిన ధర్మాసనం.. మధ్యవర్తిత్వాన్ని సూచించింది. చాలా కాలంగా కేసు, వ్యాజ్యాలు కొనసాగితే ఫ్యామిలీకి ప్రయోజనం జరగదని.. ముఖ్యంగా రాణి కపూర్ ఫ్యామిలీ ట్రస్ట్ ను సవాల్ చేస్తున్న రాణి కపూర్ (80) కు వ్యాజ్యాల ద్వారా న్యాయం జరగదని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
కుటుంబ ఆస్తులపై తనకున్న నియంత్రణను తొలగించేందుకు, అదే విధంగా సోనా గ్రూప్ పంపకాలలో తన ప్రమేయం లేకుండా చేసేందుకు ట్రస్ట్ ను అక్రమంగా ఏర్పాటు చేసినట్లు రాణి కపూర్ ఆరోపిస్తున్నారు.
సంజయ్ కపూర్ భార్య సచ్ దేవ్ కపూర్, ఇతర కుటుంబ సభ్యుల మధ్య చంద్రచూడ్ మధ్యవర్తిత్వం వహించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించనున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు సహకరించాలని కోర్టు సూచించింది. ఈ మధ్యవర్తిత్వానికి సంబంధించిన పురోగతిని 2026 లో సమీక్షించనుంది సుప్రీం కోర్టు.
వివాదం ఏంటి..?
చైర్మన్ సంజయ్ కపూర్ మరణం తర్వాత సోనా గ్రూప్‌లో ఆధిపత్య పోరు నెలకొంది. కొందరు కపూర్ కుటుంబానికి చెందిన వారమంటూ డైరెక్టర్లుగా నియమితులయ్యారని ఆయన తల్లి రాణి కపూర్ ఆరోపణలు చేశారు. కొడుకు పోయిన బాధలో ఉన్నానని, యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం)ను రెండు వారాలపాటు వాయిదా వేయాలని కంపెనీ బోర్డుకు లేఖ రాశారు. అయినప్పటికీ షెడ్యూల్ ప్రకారమే బోర్డు మీటింగ్ జరిగింది.
►ALSO READ | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ !
రాణి కపూర్ జులై 24న బోర్డుకు రాసిన లేఖలో, కుటుంబం సంజయ్ మరణం వల్ల దుఖంలో ఉండగా, కొందరు కుటుంబ వారసత్వాన్ని కైవసం చేసుకునేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సంజయ్ మరణం అనుమానాస్పదంగా ఉందని ఆమె అన్నారు. తాను ఎవరినీ బోర్డుకు నామినేట్ చేయలేదని పేర్కొన్నారు. ఏఈజీఎంలో కపూర్ కుటుంబ ప్రతినిధులుగా డైరెక్టర్ల నియామక రిజల్యూషన్ ఉందని సమాచారం. కానీ నాతో ఎటువంటి చర్చ జరగలేదు అని ఆమె తెలిపారు.
కంపెనీ ఏజీఎం నోటీసు ప్రకారం, సంజయ్ భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించే రిజల్యూషన్ ఉంది. తన భర్త వీలునామా ద్వారా తాను సోనా గ్రూప్‌లో ప్రధాన షేర్‌హోల్డర్‌గా ఉన్నానని, కొందరు తమను కుటుంబ ప్రతినిధులుగా చెప్పుకుంటున్నారని రాణి కపూర్ ఆరోపించారు. సంజయ్ మరణం తర్వాత భావోద్వేగ స్థితిలో తనను బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకం చేయించారని, వాటి వివరాలు తనకు వెల్లడించలేదని ఆమె పేర్కొన్నారు. సంజయ్ జూన్ 12న లండన్‌లో పోలో ఆడుతూ మరణించారు. తేనెటీగను మింగేయడంతో గుండె పోటువచ్చి చనిపోయారని వార్తలు వచ్చాయి.
