ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ నుంచి మినహాయింపు కోరానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. పార్లమెంటు సమావేశాల కోసం తాను ఢిల్లీలో ఉన్నందున ఈడీ విచారణకు హాజరు కాలేనని చెప్పారు. సంజయ్ రౌత్ కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ముంబైలోని తన నివాసాలకు సంబంధించిన లావాదేవీల్లో హవాలా ఆరోపణలపై విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. సంజయ్ రౌత్ భార్యతో పాటు సహాయకులపైనా ఆరోపణలు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో జులై 1న దాదాపు 10గంటల పాటు ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ విచారించింది.
“Parliament session is underway. I have sought exemption (from ED) from appearance. I will be in Delhi,” said Shiv Sena MP Sanjay Raut.
— ANI (@ANI) July 20, 2022
Raut was summoned to appear before ED at 11am today, in a money laundering case. pic.twitter.com/7ltZNYdn3M
