
న్యూఢిల్లీ: బిగ్ ఎఫ్ఎం 92.7ను నిర్వహించే రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ అప్పుల్లో కూరుకుపోవడంతో దివాలా ప్రక్రియ ద్వారా సఫైర్ మీడియా లిమిటెడ్ దీనిని చేజిక్కించుకుంది. విలీనం పూర్తయిందని తాజాగా ప్రకటించింది. రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్ (ఆర్బీఎన్ఎల్) ఫిబ్రవరి 2023 నుంచి కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటోంది.
సఫైర్ మీడియాను కైతాల్‌కు చెందిన సాహిల్ మంగ్లా, మీడియా ప్రొఫెషనల్‌గా మారిన ఎంట్రప్రెనార్ ఆదిత్య వశిష్ట ప్రమోట్ చేస్తున్నారు. బిగ్ ఎఫ్ఎం 92.7 బోర్డును, మేనేజ్మెంట్కంట్రోల్ను స్వాధీనం చేసుకోవడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి అన్ని చట్టబద్ధమైన ఆమోదాలను పొందామని సఫైర్ తెలిపింది.