
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మిల్కీబ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో అలరించనుంది. శనివారం తమన్నా బర్త్ డే సందర్భంగా ఆమె సాంగ్ కి సంబంధించిన లుక్ వదిలింది యూనిట్. ఆర్మీ ప్యాంట్, స్పోర్ట్స్ వేర్ వేసుకుని తమ్మూ బేబీ ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇస్తుంది. ‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా’ అనే ఫన్నీ లిరిక్స్‌తో తమన్నా స్పెషల్ సాంగ్ ఉండునుందని టీమ్ తెలిపింది.
ఇప్పటికే రష్మిక హీ సో క్యూట్ సాంగ్ తో ఆకట్టుకుంటుండగా..తమన్నా పోస్టర్ చూస్తుంటే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే పలు స్పెషల్ సాంగ్స్ లో ఇరగదీసిన ఈ మిల్కీబ్యూటీ మహేష్ బాబు సినిమాలో మరింత రెచ్చిపోయిందంటున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
Here's wishing the gorgeous and super talented @tamannaahspeaks a very happy birthday from team #SarileruNeekevvaru ❤
Superstar @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @ThisIsDSP @RathnaveluDop @AKentsOfficial @GMBents @SVC_official pic.twitter.com/qpmTPORRy7
— AK Entertainments (@AKentsOfficial) December 21, 2019