కాకా ఆశయాలు నెరవేర్చాలి : సరోజా వివేక్

కాకా ఆశయాలు నెరవేర్చాలి : సరోజా వివేక్
  • కాకా అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థులు బాగా చదువుకొని కాకా ఆశయాలను నెరవేర్చాలని కాకా అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్ అన్నారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి అందుతాయని తెలిపారు. శ్రద్ధగా చదువుకోవడానికి క్రమశిక్షణతో కాలేజీకి రావాలని, అప్పుడే చదువులో మెరుగైన స్థానంలో ఉంటారని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని కాకా అంబేద్కర్ కాలేజీలోని జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం జరిగింది.

ఈ కార్యక్రమానికి జాయింట్ సెక్రటరీ రమణ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి కరస్పాండెంట్ సరోజా వివేక్ హాజరై మాట్లాడారు. ఇంటర్ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. 80 శాతంపైన మార్కులు వచ్చిన విద్యార్థులకు మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉచిత విద్యను అందిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఫస్టియర్ సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బాటనీ విద్యార్థులు ఏర్పాటు చేసిన మెడికల్ బొటానికల్ గార్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమె ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన మొక్కలు, వాటి ఉపయోగాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల లెక్చరర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.