తెలంగాణలో నైరుతి రుతుపావనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ రోజు తెలంగాణ అంతటా ఈ రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ముఖ్యంగా ఈరోజు(జూన్ 23) దాదాపు 10 జిల్లాలకు భారీ వర్ష సూచనతో వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్.. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ,నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అంతేకాకుండా జూన్ 23న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్లతో పాటు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. మిగిలిన జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చు.
ALSO READ : కూతురి నిశ్చితార్థం జరిగాక ఇలా కావడంతో
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. నగరంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ కాస్త జోరుగా వాన పడే ఛాన్స్ ఉంది. అయితే, జూన్ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన చేసింది వాతావారణ శాఖ.
