
హైదరాబాద్, వెలుగు: సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కకు ఆ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఈ నెల 18న ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సెంట్రల్ జోన్ డీజీపీకి ఆ సంఘం ప్రతినిధులు వినతిపత్రం ఇచ్చారు.
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాల్లో జేఏసీ రాష్ర్ట అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి మల్లయ్య, అరవింద్‌రెడ్డి పాల్గొన్నారు