సెకండ్ ఫేజ్ తొలిరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో..సర్పంచ్ నామినేషన్లు 203

సెకండ్ ఫేజ్ తొలిరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో..సర్పంచ్ నామినేషన్లు 203

నిజామాబాద్ /కామారెడ్డి, వెలుగు : జిల్లాలోని నిజామాబాద్ డివిజన్​లో సెకెండ్​ ఫేజ్​లో జరిగే  గ్రామ పంచాయతీలకు తొలి రోజు ఆదివారం  సర్పంచ్​ స్థానాలకు 122 నామినేషన్లు, వార్డులకు 148 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎనిమిది మండలాలున్న డివిజన్​లో మొత్తం 196 జీపీలు, 1,760 వార్డులు ఉన్నాయి.  అందులో ధర్పల్లి మండలం సర్పంచ్ పదవులకు 15 నామినేషన్ లు, వార్డులకు 20, డిచ్​పల్లి మండలంలో సర్పంచ్​ స్థానాలకు 20, వార్డులకు 25 నామినేషన్స్ అందాయి.

 ఇందల్వాయి మండలంలో సర్పంచ్ పోస్టుకు 13, వార్డులకు 9, మాక్లూర్​ మండలం నుంచి సర్పంచ్ స్థానాలకు 16, వార్డులకు 11 నామినేషన్లను ఆర్వోలు స్వీకరించారు. మొపాల్​ మండలంలో సర్పంచ్ అభ్యర్థులుగా 13, వార్డు సభ్యులుగా 29 నామినేషన్లు వేశారు. నిజామాబాద్​ రూరల్​ నుంచి సర్పంచ్​ పోస్టులకు 12, వార్డుల నుంచి  13 నామినేషన్​లు అందాయి. సిరికొండ  మండలంలో సర్పంచ్​ స్థానాలకు 16, వార్డులకు 17, జక్రాన్​పల్లి మండలంలో సర్పంచ్​ పదవులకు 17, వార్డులకు 24 నామినేషన్లు దాఖాలయ్యాయి. 

కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లాలో రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే  7 మండలాల్లోని  197 పంచాయతీల్లో ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ షురూ అయ్యింది. గాంధారి మండలంలోని 31 గ్రామాలకు గాను సర్పంచ్​కి 19, వార్డు మెంబర్లకు 23, లింగంపేట మండలంలోని 41  గ్రామాలకుగాను సర్పంచ్​కి  8, వార్డు మెంబర్లకు 5, ఎల్లారెడ్డి  మండలంలోని 31 గ్రామాలకుగాను సర్పంచ్​కి 12, వార్డు మెంబర్లకు 9,  నాగిరెడ్డిపేట మండలంలోని 27 గ్రామాలకుగాను సర్పంచ్​కి 14, వార్డు మెంబర్లకు  14, మహమ్మద్​నగర్  మండలంలోని 13 గ్రామాలకుగాను సర్పంచ్​కి 14, వార్డు మెంబర్లకు 11,  నిజాంసాగర్ మండలంలోని 14 గ్రామాలకుగాను సర్పంచ్​కి 4, వార్డు మెంబర్లకు 6, పిట్లం మండలంలోని 26 గ్రామాలకుగాను  సర్పంచ్​కి 10, వార్డు మెంబర్లకు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ మంగళవారం వరకు  కొనసాగనుంది. మొత్తం సర్పంచ్​ పదవికి  81 నామినేషన్లు, వార్డు మెంబర్ స్థానాలకు 74 నామినేషన్లు వచ్చాయి.