పెనుబల్లి, వెలుగు : ప్రభుత్వం పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు కృషి చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. గురువారం పెనుబల్లి మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన సీహెచ్ బీ భవనంలోని వైద్య పరికరాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యులు సమయపాలన పాటించాలని, నిత్యం రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు.
త్వరలో కొత్తగా నిర్మించిన భవనాన్ని అందుబాటులో తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, కల్లూరు ఏఎంసీ చైర్పర్సన్ నీరజ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు, వెలుగు: మండలం పడమర లోకవరం 9వ వార్డుకు చెందిన కోలా ఉషారాణి– రామారావు దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న లింగం మహాలక్ష్మిని పరామర్శించారు.
పడమరలోకవరం గ్రామానికి చెందిన వైరా పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కడారి వెంకటేశ్వరరావు కుమారుడు శివరామకృష్ణ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెద్ద కోరుకోండి గ్రామంలో రూ.95 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
