గ్రహాల కదలికలు మన జీవిత గమనాన్ని శాసిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 2026 మే నెల ఆరంభం నుంచే గ్రహాల స్థితిగతుల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మీన రాశిలోకి శని.. ధనస్సు రాశిలోకి శుక్రుడు సంచారం వలన నాలుగు రాశుల వారికి ఆర్థిక పరిస్థితిపై, వ్యాపార లావాదేవీలపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నెల ( 2026 మే) నాలుగు రాశుల వారికి( ధనుస్సు, మకరం, కుంభం , మీన) ఎలా ఉంటుందోఈ స్టోరీలో తెలుసుకుందాం..
ధనుస్సు రాశి :
మీన రాశిలోకి శని.. ధనస్సు రాశిలో కి ప్రవేశించడం వలన ఈ నెలలో( 2026 మే) ఈ రాశి వారు ఆర్ధికంగా అభివృద్ది చెందేఅవకాశాలున్నాయి. . మే 15 వ వతేది వరకు అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది, మే 14వ తేదీ తర్వాత, శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఈ రాశి విద్యార్థులు మంచి ర్యాంకులతో త్వరగా సక్సెస్ అవుతారు. కుటుంబంలో సఖ్యత నెలకుంటుంది. ఆనందకర జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు కలసి వస్తాయి.
మకర రాశి :
ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. నెల మొదటి భాగంలో అంటే 15వ తేదీ వరకు ఇల్లు, ఆస్తి లేదా కుటుంబ అవసరాలకు సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మే 14వ తేదీ తర్వాత, శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించిన తరువాత అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమై విలువైన లాభాలు పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. డబ్బును ఆదా చేసేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీసులో కీలక పాత్ర పోషించాల్సి రావడంతో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. పెళ్లి.. ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. జీవితం సాఫీగా సాగిపోతుంది.
కుంభ రాశి :
ఈ నెలలో ( 2026 మే) ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మొదటి 15 రోజులు ప్రయాణం, కమ్యూనికేషన్, కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలగు అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. లగ్నాధిపతి శనిదేవుడు మీనరాశిలో ఉండటం వలన ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖర్చులను నియంత్రించే అవకాశం ఉంది. మే 14వ తేదీ తర్వాత, శుక్రుడు మిథునరాశిలోకి ప్రవేశించడం వల్ల వినోదం, అభిరుచులు లేదా పిల్లలపై ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, వారికి ఇది బెస్ట్ సమయం. అయితే వీరు వీలైనంత వరకు స్థిరాస్తి కొనుగోలు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా వ్యాపారస్థులకి ఇది సరైన సమయం. పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారు ఈ మాసంలో ప్రయత్నాలు చేయడం చాలా శుభసూచకమని పండితులు చెబుతున్నారు.
మీన రాశి :
ఈ రాశి వారికి ఈ నెల చాలా ముఖ్యమైనది. కొత్త ఇంటికి ప్రణాళిక చేసే అవకాశం ఉంది. టుంది. మే 11వ తేదీన కుజుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. మీరు డబ్బుకు సంబంధించి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
మే 15వ తేదీ తర్వాత స్థిరమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మే 14వ తేదీ తర్వాత, శుక్రుడు మిథునరాశిలోకి ప్రవేశించడం వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇదే రాశిలో శని ఉండటం అనవసరమైన ఖర్చులు తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
