స్టాలిన్తో లెఫ్ట్ పార్టీ నేత‌ల మీటింగ్.. విజయ్కి సపోర్ట్ చేసే విషయంలో.. ఫైనల్గా ఏం తేల్చారంటే..

స్టాలిన్తో లెఫ్ట్ పార్టీ నేత‌ల మీటింగ్.. విజయ్కి సపోర్ట్ చేసే విషయంలో.. ఫైనల్గా ఏం తేల్చారంటే..

చెన్నై: త‌మిళ‌నాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీవీకే పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ స్థానాలు రాకపోవడంతో విజయ్ వామపక్షాలు, వీసీకే మద్దతు కోరారు. అయితే.. ఈ విషయంలో వీసీకే, సీపీఐ, సీపీఎం నేత‌లు స్టాలిన్తో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. శుక్రవారం ఉద‌యం ఈ మూడు పార్టీల నేతలు మరోమారు సమావేశమై  తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. టీవీకేకు ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించడం లేదని ఇప్పటికే విజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. విశాల్, ప్రకాష్ రాజ్ వంటి సినీ నటులు బాహాటంగానే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటు, తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.

అన్నీ కుదిరి వీసీకే, వామపక్షాలు టీవీకేకు మద్దతు తెలిపితే విజయ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలు ఇలా ఉన్నాయి:

* మ్యాజిక్ ఫిగర్-118

* టీవీకే-107
* కాంగ్రెస్-05
* వీసీకే-02
* సీపీఐ-02
* సీపీఐ(ఎం)-02