స్టూడెంట్లు, నిరుద్యోగులకు ‘సత్యసాయి సేవా’ స్కాలర్ షిప్..వెయ్యి మందికి అవకాశం

స్టూడెంట్లు, నిరుద్యోగులకు ‘సత్యసాయి సేవా’ స్కాలర్ షిప్..వెయ్యి మందికి అవకాశం
  • ఈ నెల 20 వరకు దరఖాస్తులు

పద్మారావునగర్, వెలుగు: పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో పలువురికి స్కాలర్​షిప్​లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సంస్థ ప్రతినిధి సాయిబాబా మంగళవారం  ప్రకటించారు. స్టూడెంట్లు, నిరుద్యోగులను ప్రోత్సాహించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందిని ఎంపిక చేస్తామని  పేర్కొన్నారు. సెప్టెంబర్​ 20 లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 99080 51617 నంబర్​లో సంప్రదించాలని సూచించారు.