న్యూఢిల్లీ: ఇండియా గ్రోత్‌కు కీలకమైన సన్‌రైజ్ సెక్టార్లలో రూ.100 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. ఇందుకోసం చక్రా పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించింది. రానున్న ఐదేళ్లలో ఈవీ, ఫిన్‌టెక్, రెన్యూవబుల్ ఎనర్జీ, సెమీకండక్టర్స్ వంటి సెక్టార్లలో భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. ఇది అప్పు, ఈక్విటీ పద్ధతుల్లో జరుగుతుంది.
ఎస్‌బీఐ చైర్మన్ సి.ఎస్. శెట్టి మాట్లాడుతూ, ఈ రంగాల్లో లోన్ అవకాశాలు రూ.20–22 లక్షల కోట్ల వరకు ఉన్నాయని అన్నారు. కేవలం అప్పుల ద్వారా కాకుండా ఈక్విటీ కింద మార్చుకోవడానికి వీలు కలిపించే కొత్త ఫైనాన్సింగ్ విధానాలు, ఇతర మార్గాలు అవసరమని తెలిపారు.
ఎస్‌బీఐ ఇప్పటికే 21 ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. జపాన్ బ్యాంకులు ఎస్‌ఎంబీసీ, ఎంయూఎఫ్‌జీ, అలాగే ఇండియన్ సంస్థలు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, నాబార్డులతో జత కట్టింది.
