రోడ్డు ప్రాజెక్టుల కోసం అప్పు ఇచ్చిన ఎస్​బీఐ

రోడ్డు ప్రాజెక్టుల కోసం అప్పు ఇచ్చిన ఎస్​బీఐ

ముంబై : దేశంలోని రోడ్డు ప్రాజెక్టులకు రూ. 90 వేల కోట్ల మేర అప్పులు ఇచ్చినట్లు ఎస్​బీఐ ఛైర్మన్​ దినేష్​ ఖారా చెప్పారు.  మొత్తం అన్ని బ్యాంకులు రోడ్డు ప్రాజెక్టులకు ఇచ్చిన  అప్పుల్లో ఇది  37 శాతానికి సమానమని అన్నారు. జూన్​ నెలాఖరు దాకా ఎన్​హెచ్​ఏఐకు రూ. 35 వేల కోట్ల క్రెడిట్​ గ్రాంట్​ చేశామని తెలిపారు. వివిధ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్టుల అమలు కోసమే ఈ అప్పులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ–ముంబై ఎక్స్​ప్రెస్​వే ప్రాజెక్టు ఎస్​పీవీకి రూ. 5 వేల కోట్లు ముందు ఇచ్చామని, ఇటీవలే ఆ అప్పును రూ. 8 వేల కోట్లకు పెంచామని ఖారా చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్​ హైవేస్​ ఇన్​ఫ్రా ట్రస్ట్​ సమీకరించిన మొత్తం ఫండ్స్​లో సగం తామే సమకూర్చినట్లు వెల్లడించారు.