పాన్‌‌‑ఆధార్  లింక్ తప్పనిసరి!

పాన్‌‌‑ఆధార్  లింక్ తప్పనిసరి!

న్యూఢిల్లీ: కస్టమర్లు త్వరగా పాన్‌‌ కార్డును ఆధార్‌‌‌‌ నెంబర్‌‌‌‌తో లింక్  చేసుకోవాలని స్టేట్‌‌ బ్యాంక్‌‌  సలహాయిచ్చింది.  డెడ్‌‌లైన్‌‌లోపు పాన్‌‌–ఆధార్‌‌‌‌ లింక్‌‌ను తప్పనిసరిగా  పూర్తి చేయాలని  ట్విటర్ ద్వారా పేర్కొంది. బ్యాంకింగ్ సర్వీస్‌‌లలో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలంటే వీటిని లింక్ చేయాలని  తెలిపింది.   పాన్‌‌–ఆధార్ లింక్ డెడ్‌‌లైన్‌ను సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ డెడ్‌‌లైన్‌‌లోపు పాన్‌‌ కార్డుతో ఆధార్‌‌‌‌ను లింక్ చేయకపోతే, పాన్ కార్డు పనిచేయదు. తిరిగి యాక్టివేట్ చేయాలంటే రూ. 1000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. లింక్ చేసుకోవడానికి ఎస్‌‌ఎంఎస్‌‌ ద్వారా అయితే, యూఐడీపాన్‌‌ అని టైప్‌‌ చేసి స్పేస్‌‌ ఇచ్చి ఆధార్ నెంబర్‌‌‌‌ను టైప్ చేసి స్పేస్‌‌ ఇచ్చి పాన్ నెంబర్‌‌‌‌ను టైప్ చేయాలి. ఈ మెసేజ్‌‌ను 567678 లేదా 56161 కి పంపాల్సి ఉంటుంది. వెబ్‌‌సైట్ ద్వారా అంటే  incometaxindiaefiling.gov.in సైట్‌‌లో లింక్ చేసుకోవచ్చు.